ధీరుడు కి మగధీర టైటిల్ చాల ఏప్ట్ గా వుంటింది కదా అందుకే మగధీర కన్ఫర్మ్ చేసేసారు...ఎవరు ఆ మాఘదీరుడు అనుకుంటున్నారా..అసలు అలా ఎలా అడుగుతారు ఇంకెవరు మన రామ్ చరణ్ తేజ...విషయానికి వస్తే ....
రామ్ చరణ్ తేజ,రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ కి మగధీర అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ధీరుడని,డేగ అని రకరకాల టైటిల్స్ ఈ సినిమా కోసం పరిశీలించి చివరకు రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి ఈ టైటిల్ కరెక్టుగా ఏప్ట్ అవుతుందని యూనిట్ వర్గాలు సంతృప్తి చెందుతున్నారు.పునర్జమ్మ చుట్టూ తిరిగే ఈ కథ నాలుగు వందల ఏళ్ళ క్రిందట ప్రారంభమయి ఇప్పటి కాలంలో ముగుస్తుంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో శ్రీహరి మరో కీలీక పాత్ర పోషించనున్నారు.గజనీ విజయోత్సాహంలో ఉన్న గీతా ఆర్ట్స్ ఈ చిత్రం కూడా సంచలనం సృష్టించే రీతిలో మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రియల్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి రెండో వారంలో ఆడియా రిలీజ్ అవుతుంది. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment