Monday, February 9, 2009
బొగ్గు గనుల్లో పవన్
ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో భాగంగా యువరాజ్యం నేత పవన్ కళ్యాణ్ బెల్లంపల్లి ఓపెన్‌కాస్ట్(ఖైరిగూడ) గనిని పరిశీలించారు.ఆదివారం మధ్యాహ్నం కాగజ్‌నగర్ నుంచి బయలుదేరిన అటవీ ప్రాంతంలోనే కాన్వాయ్‌ను ఆపి భోజనంచేశారు. అనంతరం కేకే-టు భూగర్భ గనిలోకి వెళ్లి గంటన్నర సేపు అందులోనే గడిపారు.అక్కడి బొగ్గుగని కార్మికులతోనూ, సింగరేణి అధికారులతోనూ మాట్లాడారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణిలో మైనింగ్ పాలసీని ప్రవేశపెడతామని అన్నారు. ఈ మేరకు ప్రజారాజ్యం మెనిఫెస్టోలో సైతం మైనింగ్ పాలసీని పొందుపరుస్తామని అన్నారు.
ప్రజలపక్షాన పోరాటంచేసే కొమురం భీం లాంటి మహానుభావుడిని కన్న ఆదిలాబాద్ జిల్లాకు పాదాభివందనమన్నారు. నిజమైన హీరోలు వారేనని, సినిమాల్లో నటించే తాము కాదని చెప్పారు.సభలో తెలంగాణా విషయం మాట్లాడాలంటూ నతెపా కార్యకర్తలు డిమాండ్ చేయడంతో పవన్ ఆ విషయంపై మాట్లాడారు. సింగరేణి గనుల్లో పనిచేసే కార్మికుల బతుకుల్లో వెలుగులు రావాలి.. వారు కన్నీరు కార్చకూడదు.. వారి బతుకులు మోడువారకూడదు అన్నారు.
సింగరేణి కార్మికుల పరిస్థితి చూస్తే హృదయం తరుక్కుపోతోంది.. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల కన్నీరు తుడుస్తామని, కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామనిపవన్ కళ్యాణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం రెండో రోజు జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఓపెన్ కాస్‌ట గనులను, అండర్‌గ్రౌండ్ గనులను సందర్శించి అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను గమనించారు.ఏ.సి గదుల్లో వుండీ హీరో తమ కోసం బొగ్గు గనులలోకి దిగటం తో అక్కడి కార్మికులే కాదు,అక్కడి ఊరి వారు కూడా చాల సంతోషించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment