చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లే తెలుగు సినీ పరిశ్రమలో సంక్షోభం ఏర్పడిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీనటి రోజా అన్నారు. ఆయన వల్లే ప్రస్తుతం పరిశ్రమ మూడు గ్రూపులుగా విడదీశారని, కళాకారులు జాగ్రత్తగా ఉండాలని రోజా తనదైన శైలిలో విమర్శించారు.తిరుపతిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆమె చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పర్యటించారు. చిరు, పవన్‌లపై విమర్శలు కురిపించారు.
అవినీతి అంటేనే తెలియదని చెబుతున్న చిరంజీవి తన వద్దనున్న నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకోవడానికేబ్లడ్‌బ్యాంకును స్థాపించారని ఆమె తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చిరంజీవి ఫ్యామిలీ వేధింపులకు భయపడి కోర్టును ఆశ్రయిస్తే తప్ప శ్రీజ, నందినిలకు బతికే హక్కు ఉండదన్నారు. అలాగే ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్‌ల మంచితనం గురించి చిరు కుమార్తె శ్రీజ, పవన్ మొదటి భార్య నందినిలను అడిగితే వారే చెబుతారని తెలుగు ఆమె ఎద్దేవా చేశారు.
చిరంజీవికి మహిళలపై గౌరవముంటే నందినికి పీఆర్పీలో మంచి పదవి ఇవ్వాలని, శ్రీజను ఇంటికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కల్లు ముంత చేతపట్టుకున్నాడో, తాగి చిందులేశాడో ప్రజలందరూ చూశారన్నారు. ఆ రోజు కూడా పవన్ తాగి చిందులేయడం గురించే మాట్లాడానే తప్ప గీత కార్మికులను అవమాన పరచ లేదు అని రోజా తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment