Tuesday, February 17, 2009
మంత్ర దర్శకుడు పూరి తమ్ముడి తో సినిమా
'మంత్ర' సినిమాతో ట్రెండ్ సెట్టర్ గా మారిన తులసీ రామ్ ఈ మధ్యన పూరీ జగన్నాధ్ ఆఫీసుకు డైలీ వెళ్తున్నాడని, ఆయనతో ఇతనికేం పని అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలాడుతున్నారు. అయితే అందిన సమాచారం ప్రకారం తన వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ, తులసీరామ్ కి అవకాసమిచ్చినట్లు తెలుస్తోంది. అదీ తమ్ముడు సాయిరామ్ శంకర్ ని హీరోగా పెట్టి తీయమని. నిజానికి కోతులు చిత్రంతో పూరీ తన తమ్ముడుకి లైఫ్ ఇస్తాడని అంతా ఊహించారు. అయితే అతను మళ్ళీ ప్రభాస్ తోనూ అనంతరం పవన్ తోనూ వరస బిజీకావటంతో ఆ పని చేసాడని చెప్తున్నారు. అందులోనూ సాయిరామ్..అన్న సినిమా కోసం పూర్తి సిక్స్ పాక్ తో రెడీ అవటం,లేదని తెలియటంతో నిరాశలో పడటం జరిగాయి. ఇది గమనించే పూరీ ఈ నిర్ణయం తీసుకున్నాడని వినికిడి.
ఇక ఇంతకుముందు మెగా ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్.రాజు నిర్మాతగా తులసీరామ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే మస్కా ఫలితం అనుకూలంగా లేకపోవటం, తులసి చెప్పిన స్క్రిప్టు ఎమ్.ఎస్.రాజుకి నచ్చకపోవటంతో అది విరమించుకున్నాడని అంటున్నారు. ఇక ఏడాది పాటు వండిన స్క్రిప్టుని ఇప్పుడు సాయిరామ్ కి కట్టబెడుతున్నాడన్నమాట. ఇంతకు ముందు తులసి వరుణ్ సందేశ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు చేసాడు. ఒక విచిత్రమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఇక కథనంలో పూరీ హస్తం కూడా ఉండవచ్చునని అంటున్నారు. ఏదైమైనా పూరీకీ, తులసీరామ్ కీ ఎలా ఉన్నా సాయిరామ్ శంకర్ కి మాత్రం ఈ ప్రాజెక్టు పెద్ద ఊరటే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment