సినీ రంగంలో ఫేడవుట్ అయిన లేదా అవకాశాలు తగ్గిన చిన్నా పెద్దా నటులంతా రాజకీయాలను ఆశ్రయిస్తుంటే..తానెందుకు ఖాళీగా ఉండాలనుకుందో ఏమో సీనియర్ నటి నగ్మా కూడా దూకేస్తోంది. భూపాల్ నుండి ఆమె కాంగ్రేస్ తరుపున పోటీకి నిలుస్తోంది. ఇప్పటికే అక్కడ సమాజ్ వాద్ పార్టి టిక్కెట్ పై జయాబచ్చన్,బిజీపీ తరుపున సుష్మ స్వరాజ్ పోటీలో ఉన్నారు. ఇక జయాబచ్చన్ సినీ నటికాకముందు భూపాల్ లోనే నివాసం. ఆమె తండ్రి అక్కడ ప్రఖ్యాత జర్నలిస్టు తరుణ్ కుమార్ బూధురీ.అలాగే నగ్మాకూ భూపాల్ ఏం కొత్త కాదు. ఇక భూపాల్ నుండి పోటి చేయటానికి ఆసక్తి చూపుతున్న నగ్మా వ్యక్తిగత వివరాలతో కూడిన దరాఖాస్తు సోమవారం ఎంపి కాంగ్రేస్ కమిటీకి అందింది. అలాగే నగ్మా అమ్మమ్మ,తాత ఇప్పటికీ అదే నగరంలో నివసిస్తున్నారు. ఘరానా మొగుడు సూపర్ హిట్స్ లో నటించిన ఆమె తర్వాత అల్లరి రాముడు వంటి సినిమాల్లో అత్తగానూ కన్పించింది. అయితే ఇక్కడ కెరీర్ ఊహించినంత స్పీడుగా లేకపోవటంతో భోజ్ పురి కి వలసవెళ్ళి అక్కడ సినిమాలు చేస్తోంది. అయితే అక్కడా ఆమె పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉండటంతో రాజకీయాలవైపు చూస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ నగ్మా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment