Monday, February 9, 2009
అల్లు అర్జున్ పెళ్లి
అరె..అల్లు అర్జున్ పెళ్ళా..అదీ ఐదు రోజులా...ఆ అమ్మాయెవరు అంటూ కంగారు పడకండి..ఇదంతా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఓ సన్నివేశం. ఆ రోజుల్లో జరిగే ఐదురోజుల పెళ్ళి వ్యవహారం ఇప్పటి తరానికి చూపించాలని ఈ ప్రయత్నం చేస్తున్నారుట. ఇక ఇదంతా ఓ పాటలో వచ్చేస్తుంది. అల్లు అర్జున్ ఈ పాటలో రోజుకో గెటప్ అన్నట్లు సంప్రదాయాన్ని ప్రతిబింబించే డ్రెస్ లు వేసుకుంటాడు. వాటికోసం ఇప్పటికే రకరకాల కసరత్తులు చేస్తున్నారు. అలాగే ఈ పాటను వేటూరి సుందర రామ్మూర్తిగారి చేత రాయిస్తున్నారు.
ఆయన కూడా చాలా సంతోషంగా చాలా కాలం తర్వాత తెరమరుగైపోతున్న మన సంప్రదాయాలను తెరపై చూపి రికార్డు చేయటం అవసరమని,అధ్బుతమైన పాట ఇస్తానని మాట ఇచ్చారుట. ఈ మేటర్ ప్రక్కన పెడితే గుణశేఖర్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. సహజత్వం కోసం నిజజీవితంలోని యాభై కుటుంబాలను షూటింగ్ కి ఒప్పించారు. ఇవన్నీ చూస్తుంటే మరో మెగా హిట్ తెరగు తెరని పలకరించబోతోందన్న ఫీలింగ్ కలుగుతోందని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజం కావాలని కోరుకుందాం. ప్రస్తుతం అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య-2 జరుగుతోంది. ఇందులో కాజల్ హీరోయిన్ కాగా,నవదీప్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సాప్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో కథనం మొత్తం జరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment