ప్రస్తుతం రామ్ చరణ్ తేజ చిత్రంలో బిజీగా ఉన్న రాజమౌళి తదుపరి చిత్రానికి తాజాగా కమిట్ అయ్యినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ హీరో మరెవరో కాదు..నాగార్జున తనయుడు నాగచైతన్య. ప్రస్తుతం వాసు వర్మ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం పూర్తవగానే పూర్తి స్ధాయి కమర్షియల్ హీరోగా నిలబెట్టేందుకు రాజమౌళి చేతిలో పెట్టనున్నాడని తెలుస్తోంది. అయితే చాలామంది నాగచైతన్య రెండో సినిమా పూరీ డైరక్ట్ చేస్తారనుకున్నారు. కానీ ఆయనా రేసులో లేరు. అలాగే రాజమౌళి ఓ స్టోరీ లైన్ చెప్పాడని, కథ కూడా పూర్తిగా వినాల్సిన పనిలేదని, పూర్తి నమ్మకం ఉందని నాగార్జున, రాజమౌళితో అన్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అనంతరం నాగచైతన్య మూడో సినిమా ఓ ప్రముఖ భ్యానర్ (నాగార్జనకి పెద్ద హిట్స్ ఇచ్చిన)చేయనున్నారు. అయితే వారికీ రాజమౌళికీ ఉన్న రిలేషన్ బట్టి తామే నిర్మిస్తామన్నా...వద్దని కింగ్ నిర్మాతకి ఆ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైమైనా నాగార్జున తన కుమారుడు కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. బెస్టాఫ్ లక్ నాగ చైతన్య.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment