ప్రజారాజ్యంలో తమకు తగిన స్దానం, గుర్తింపు లేదని కలత చెందుతున్న అభిమానుల ఆవేదనను తొలిగేంచేందుకు ఓ సమావేశం గురువారం నిర్వహిస్తున్నామని పీఆర్పీ నగర మీడియా కార్యదర్శి నందు మీడియా ప్రకటనలో తెలిపారు. దాదాపు ఐదు వేల మంది అభిమానులుద్దేసించి వీరిద్దరూ మాట్లాడతారని అన్నారు.రాజకీయాల్లోకి వచ్చి 2500 కోట్లు సంపాదించాలన్న లక్ష్యం తోనే చిరంజీవి పార్టీ స్థాపించారు. అల్లు అరవింద్ వల్లే పార్టీ భ్రష్టుపడుతోంది. జిల్లాలవారీగా టికెట్లకు టార్గెట్లు పెట్టారు అంటూ కేశినేని నాని,పార్టీలో సామాజిక న్యాయం లేదు. టికెట్లు అమ్ముకుంటున్నారు. డబ్బున్న వారికే టికెట్లు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజారాజ్యం ఒక రాజకీయపార్టీ కాదు. సినిమా స్టుడియో. చిరంజీవి హీరో, అల్లు అరవింద్ నిర్మాత అంటూ తాజాగా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్ చేసిన ఆరోపణలు ప్రజారాజ్యాన్ని డిఫెన్సెలో పడేసాయి.దాంతో బయిట పార్టీల విమర్శలు కన్నా తమలోని వారు,తమలోంచి బయిటకు వెళ్ళిన వారుచేస్తున్న ఆరోపణలు పూర్తి స్ధాయిలో ఎదుర్కొనేందుకు సమాయత్తమవ్వాలని పార్టీ నిర్ణయించుకుందని సమాచారం. ఇక పేదల కష్టాలు చూడలేక మార్పు కోసం పార్టీ పెట్టామని ప్రకటించిన ప్రజారాజ్యం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు సైతం ఆ పార్టీని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అందుకనే వాస్తవాలను వివరించేందుకు, తమను ఇన్నాళ్ళుగా అంటిపెట్టుకుని ముందుకునడిపించిన అభిమానుల అండను బలంగా చేసుకునేందుకు నిర్ణయించుకుని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment