కావ్య నాయకుడిని పోలిన లక్షణాలు కలిగియున్న వారికే మొన్నటి వరకూ వెండితెరపై కథానాయకులుగా వెలుగొందే అవకాశం ఉండేది. ఆ లక్షణాలు లేనివాళ్లు విలన్లుగా, కమెడియన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్‌టలుగా సెటిలవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకుల అభిరుచుల్లో భారీ మార్పులు వచ్చాయి. హీరో అంటే పైలోకం నుండి ఊడి పడినట్లుగానే ఉండాల్సిన అవసరం లేదని, మన పక్కింటి, పొరుగింటి కుర్రాడిలా ఉంటే చాలని, నేటితరం ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పుకు నేనే ఉదాహరణ అంటున్నాడు తమిళ యువ కథానాయకుడు ధనుష్. ``ఎవరైనా హీరో కావచ్చనడానికి నేనే ఉదాహరణ. నా అందం, నా నటన అన్నీ అన్నీ అంతంత మాత్రమే'' అని చాలా నిజాయితీగా ఒప్పుకుంటున్నాడీ కుర్ర కథానాయకుడు. తలకు రంగేసుకోవటం, గెడ్డం గీసుకోవడం వంటివేమీ చేయకుండా సాదాసీదాగా కనిపిస్తూ కూడా సూపర్‌స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్న తన మామ రజనీకాంత్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నట్లున్నాడు ధనుష్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment