తాజాగా పెళ్ళిపీటలెక్కిన సంగీత..తానేం చేయాలన్నా ఆ మూడు రోజులు గడిచిన తర్వాతేనని స్పష్టం చేసింది. ఆమె వివాహానంతరం తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఇది చెప్పుకొచ్చింది. దాంతో ఓ మీడియా వ్యక్తి మరింత ముందుకెళ్ళి ఆ మూడు రోజులు ఏం చేస్తారు..ప్రత్యకమైన ప్లానింగ్ ఉందా అని అడిగాడు. దానికామె నవ్వుతూ పిభ్రవరి ఆఖరి వారంలో మూడు రోజుల పోగ్రామ్ పెట్టుకున్నాము. మొదటి రోజు సినిమా వాళ్ళకి స్పెషల్ రిసెప్షన్ ఇస్తాను. రెండవరోజు..అటు వైపు, ఇటువైపు చుట్టాలకి రిసెప్షన్, మూడవ రోజు నా క్లోజ్ ప్రెండ్స్ కి ప్రత్యేకం...అంది.అదేంటి నీ క్లోజ్ ప్రెండ్స్ సినిమా వాళ్ళలోనూ,చుట్టాల్లోనూ లేరా..అంటే అంత లాజిక్ అవసరమా అన్నట్లు చూసిందిట. ఇక ఆమె వివాహానంతరం చేసే సినిమా తెలుగు భాషా చిత్రమని చెప్తోంది. ఏప్రియల్ రెండవవారంలో సినిమా ప్రారంభంకానుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా కాకపోయినా ..కీలకమైన పాత్ర, కథను మలపు తిప్పేది అని చెప్తోంది. అలాగే తన భర్త క్రిష్ హీరోగా ఓ చిత్రం నిర్మించే ప్లానింగ్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా హనీమూన్ అనంతరం తమ తమ కెరీర్స్ బాగా దృష్టి పెట్టి ఫ్యామిలీ లైఫ్ కి ఉపకరించే మొత్తాలను వెనకేసుకోవాలని మొగడూ, పెళ్ళాలిద్దరూ ఆలోచిస్తున్నారట. మంచిదే కదా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment