
షారూఖ్ ఖాన్ ఇంటిపై ఈరోజు ఉదయం ఆగంతకులు కొందరు దాడి చేశారు. ఉదయమే బాంద్రాలోని ఆయన ఇంటివైపు వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన ఇంటిపై పేలుడు పదార్థంతో కూడిన ఓ సీసాను విసిరి పారిపోయారు. పోలీసులకు షారూఖ్ కుటుంబసభ్యులు ఫిర్యాదుచేయగా వారు వచ్చి ఆగంతకులు విసిరిన వస్తువు నాటు బాంబుగా తేల్చారు. అదృష్టవశాత్తు అది పేలక పోవటంతో ఎవరూ గాయపడలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. షారూఖ్ తాజా చిత్రం బిల్లూ బార్బర్ వివాదాలకు కేంద్రమైన నేపథ్యంలో ఈ దాడి జరగటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
No comments:
Post a Comment