Tuesday, February 17, 2009
జూలై లో నాగ చైతన్య సినిమా
నాగార్జున తనయుడు నాగచైతన్యను కథానాయకుడుగా పరిచయం చేస్తూ శ్రీవెంకటేశ్వర క్రియేషన్‌స పతాకంపై వాసూవర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న `జోష్' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇది ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ పూర్తి వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ప్రముఖ సీనియర్ కథానాయిక రాధ కుమార్తె కార్తీక నటిస్తుండటం విశేషం. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కాబోతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment