అరుంధతి సినిమా చూసి మతిచలించిన ఓ యువతి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహం పట్నం మండలం మంగళంపల్లె గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మంజుల(25)కు మూడు నెలల క్రితం శంషాబాద్ కు చెందిన రవితో వివాహం జరిగింది. కాగా ఇటీవల కర్మాన్ ఘాట్ లో ఓ సినిమా ధియోటర్ లో అరుంధతి సినిమాను భార్యాభర్తలు వెళ్ళి చూసారు. సినిమా చూసిన మరుసటి రోజు నుంచి మానసిక స్ధితి కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటం, నాట్యం చేయటం, విచిత్ర ప్రవర్తనకు పాల్పడుతోంది.దీంతో భర్త రవి, అత్త సుగుణమ్మలు ఆమెను పుట్టింటికి పంపి వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎన్ని ఆసుపత్రులకు పంపినా రోగం నయం కావడంలేదని మంజుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంకరంగా మారిపోయిన ఈమె స్ధితిని చూసిన వారు అరుంధతి లాంటి సినిమాలు తీయవద్దని కోరుతున్నారు. ఇక అరుంధతి సినిమా శ్యామ్ ప్రసాద్ రెడ్డి రూపొందించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అనూష్క ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. సోనూ సూద్ ప్రతినాయుకుడు పాత్రను పోషించాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment