నేపాలీ సుందరి మనీషా కొయిరాలా ఎట్టకేలకు పెళ్లి పీటల మీద కూర్చోనుంది. తన చిరకాల బాయ్ ఫ్రెండ్ క్రిస్టోఫర్ డోరిస్ తో మార్చిలో మనీషా మూడుముళ్ల వేయించుకోనుందని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. పెళ్లి గురించి మనీషా ఆలోచించడం బహుశా ఇదే ప్రథమమనీ, క్రిస్టోఫర్ ను తన మిత్రులందరికీ కూడా పరిచయం చేసిందనీ మనీషా ఫ్రెండ్ ఒకరు తెలిపారు. డోరిస్ మంచి రచయిత, ఔత్సాహిక పారిశ్రామిక వే్త్త, స్పోర్ట్స్ కౌన్సిలర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.మనీషాకూ, క్రిస్టోఫర్ కూ గతంలో కొన్ని విభేదాలు వచ్చాయనీ, ఇటీవల ఆ ఇద్దరూ మలేసియా ట్రప్ నుంచి తిరిగి వచ్చిన తరుణంలో క్రిస్టోఫర్ పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చారనీ, మనీషా కూడా తన సమ్మతి తెలియజేసిందనీ చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment