ఈ వారం సిధ్దార్ధ, తమన్నా జంటగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ డైరక్షన్లో నల్లమలుపు బుజ్జి నిర్మించిన కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా సినిమా రిలీజైంది. అయితే కథ, కథనాలు రెండూ పాతగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అయి నిలిచాయి. దాంతో ఇది ఫ్యామిలీ సినిమా అని ఎంత పబ్లిసిటీ చేసినా ఆ ధియోటర్లు ఫుల్ కావటం లేదు. అలాగే ఎంతో హైప్ తో బాలా దర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్ చిత్రం నేనే దేముడ్ని చిత్రం కూడా అదే పరిస్ధితిని ఎదుర్కొంటోంది. ఒకదానికి మరొకటి సంబంధం లేని సన్నివేశాలు, జంపింగ్ లు, అర్ధంకానీ సందేంశం ఈ సినిమాను సామాన్య ప్రేక్షకుడు నుండి దూరం చేస్తున్నాయి.
ఈ రెండు ఇలా ఉంటే ఇక ఈ వారం కూడా అరుంధతి చిత్రమే టాప్ చెయిలో కొనసాగుతోంది. ఇక జగపతి హీరోగా, జెడి దర్శకత్వంలో నిన్న రిలీజైన సిద్దం చిత్రం కూడా ఫ్లాప్ టాక్ ని మూట కట్టుకుంది. బాలీవుడ్ అబ్ తక్ చప్పన్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటంలో విఫలమవుతోంది. ఓపినింగ్స్ కూడా సరిగా లేకపోవటంతో మౌత్ టాక్ కూడా పుట్టే అవకాశం లేకుండా పోయింది. అలాగే జీవిత దర్శకత్వంలో మరో బాలీవుడ్ సినిమా ఖాఖీ రీమేక్ గా రూపొందిన మరో పోలీస్ చిత్రం సత్యమేవ జయితే. ఈ చిత్రం రిలీజైన మొదటి ఆటకే ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment