తమిళ నిర్మాతల మండలి(నడిగర సంఘం) పెట్టిన బ్యాన్ పై నయనతార మండిపడుతోంది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ..అసలు లింగు స్వామి ఎవరు..నాకు కాంపన్సేషన్ ఎంతో డిసైడ్ చేయటానికి..నేను మూడు నెలలు అతని సినిమా ప్రారంభమవుతుందని వెయిట్ చేసాను. ఒక్కోటి చొప్పున భారీ తెలుగు,తమిళ సినిమాలు వదిలేసుకున్నాను. నేను నష్టపోయింది చాలా ఎక్కువ...నేను కోల్పోయిన డబ్బుని, టైమ్ ని ఎవరు వెనక్కి తీసుకురాగలరు..అయినా లింగుసామి చిత్రంలో నటించనని నేను ఏనాడూ అనలేదు. వాళ్లకు కేటాయించిన కాల్షీట్లలో పలుసార్లు మార్పుచేర్పులు చేశారు. అంతెందుకు బ్యాన్ పెట్టిన నడిగర సంఘం వారు...ఈ వివాదంపై నా వివరణ తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.అలాగే మరో విషయం ఫలానా రకంగా ఉండాలని ఎవరూ నన్ను ఫోర్స్ చేయలేరు..చేయలేదు..ఓ ఇండిపెండింట్ మహిళగా నాకున్న ఆలోచనా పరిధిలో నా నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తున్నాను. నా ఆత్మాభిమానం కన్నా ఏదీ ఎక్కువ కాదు...ఈ వివాదంలో నేను నటిని..ఆడదాన్ని కాబట్టే టార్గెట్ చేసారు..కానీ నేను న్యాయం కోసం పోరాడుతాను అని మీడియాకు వెళ్ళడించింది.ఇక ఈ వివాదం దర్శకుడు లింగు స్వామి తన సోదరుడు చంద్రబోస్ నిర్మించనున్నపయ్యా సినిమా నిమిత్తం చెల్లించిన అడ్వాన్స్ తిరిగి చెల్లించమనంటంలో ప్రారంభమైంది. మొదట ఇరవై లక్షలు అడ్వాన్స్ గా కోటి రెమ్యునేషన్ గా అనుకున్నారు. అయితే నయనతార వరస ఫ్లాపులు, రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న ఆర్ధికమాణ్యం గమనించి అంత రెమ్యునేషన్ ఇచ్చుకోలేమన్నారు. ఆమె ఒప్పుకోలేదు. మొదట అనుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం కానివ్వమంది. దాంతో వారు ఆమె స్ధానంలో తమన్నాని తీసుకుని అడ్వాన్స్ తిరిగి ఇమ్మన్నారు. ఆమె తనని ఖాలీగా ఉంచినందుకు పరిహారంగా ఆ అడ్వాన్స్ జమకట్టుకుంటున్నానని చెప్పింది. అదే ఇంత గొడవకూ కారణమైంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment