Monday, February 9, 2009
నేనూ పోటీ చేస్తా: శ్రీహరి
పార్టీ ఆదేశిస్తే తాను పోటీచేస్తానని,వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రముఖ సినీనటుడు శ్రీహరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఫధకాలను ప్రస్తుతించారు. అలాగే ముఖ్యమంత్రి రాజశేఖరరె డ్డి చేసిన అభివృద్ధి పనులే పార్టీని విజయపథాన నడిపిస్తుందని స్పష్టం చేసారు. కాంగ్రేస్ విజయం కోసం రాష్ట్రమంతా ప్రచారం చేస్తానన్నారు. ప్రస్తుతం శ్రీహరి ..రామ్ చరణ్ తేజ చిత్రంలో కీలకమైన పాత్ర చేస్తున్నారు. అలాగే ఆయన నటించిన శ్రీశైలం సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. షారూఖ్ ఖాన్ మై హూనా చిత్రానికి ఫ్రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం మరీ పాత వాసనలు వెదజల్లుతూ రావటం ఎవరినీ ఆకర్షించలేకపోతోంది. ఇక శ్రీహరి కాంగ్రేస్ తరుపున పోటీ చేస్తాననటం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment