సీతారామయ్యగారి మనమరాలు, ప్రెసిడెంటుగారి పెళ్ళాం వంటి సినిమాలతో తెలుగునాట తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న మీనా త్వరలో పెళ్ళి చేసుకోనుంది. అలాగే తెలుగులో ఓ సినిమా స్ట్రైయిట్ గా చేయటానికి కమిటయ్యింది. ఆ మధ్య పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా చేసిన కధానాయుకుడు చిత్రంలో జగపతిబాబుకి జోడీగా చేసిన మీనా ప్రస్తుతం తరిగొండ వెంగమాంబ అనే పౌరాణిక సీరియల్ చేస్తోంది. టీటీడి దేవస్ధానం వారి ఎస్వీ ఛానెల్ లో ఈ సీరియల్ టెలీ కాస్ట్ అవుతోంది.అయితే ఈ మద్య ఆది కేశవుల నాయుడు ఉదంతంతో ఛానెల్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చాయి. డబ్బు తీసుకుని కావల్సిన వారందరికీ సీరియల్స్ సాంక్షన్ చేయటాన్ని ఆపుచేయాలని ఇక నుంచి ఇన్ హౌస్ ప్రొడక్షన్ కే ప్రయారియీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో దొరస్వామి రాజుగారు నిర్మిస్తున్న ఈ సీరియల్ కు యాభై మూడు ఎపిసోడ్లు వరకే పర్మిషన్ వచ్చింది.దాంతో గతంలో అన్నమయ్య చిత్రం తీసి హిట్టి కొట్టిన అనుభవంతో దొరస్వామి రాజుగారు తన ఆస్ధాన కథానాయకి మీనాతో ఈ సీరియల్ ని సినిమాగా తీసే ఆలోచనలో ఉండి టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. కొంతమంది ఆ సీరియల్ దర్శకుడు ఉదయ్ భాస్కర్ నే చిత్రాన్ని డైరక్ట్ చేసే భాద్యత అప్పచెప్పుతాడని అంటున్నారు. మరికొంత మంది అదేంకాదు..మళ్ళీ రాఘవేంద్రరావు చేతే చేయించే యోచన ఉందంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment