Tuesday, February 17, 2009
ఆకాష్, సునైన పెళ్లి?
ఆనందంతో తెలుగువారికి చేరువైన కథానాయకుడు ఆకాష్. విదేశల్లో చదువుకుని భారతదేశానికి చేరుకున్న ఈ నటుడు రాజశేఖర్ లాగా తెలుగు మాట్లాడుతాడు. అడిగితే తన పూర్వీకులు తెలుగువారన్న విషయాన్ని చెప్పుకొస్తాడు. ఈ నటుడు ఇటీవల స్వీట్ హర్ట్ అనే సినిమాతో దర్వకుడిగా కూడా మారుతున్నాడు. ఆకాష్ తమిళంలో సునైనతో కలిసి మదన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సునైన కథానాయిక. తెలుగులో ఒక్కరోజు కూడా ఆడని చాలా సినిమాల్లో ఆమె కథానాయికగా నటించింది. సునైన , ఆకాష్ కలిసి నటిస్తున్న మదన్ సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరికి ప్రేమ పుట్టింది. చెన్నైలో చాలా చోట్లకు వీళ్లిద్దరు కలిసి వెళ్తున్నారు. షూటింగ్లో కూడా షాట్ పూర్తికాగానే వీళ్లిద్దరి గుసగుసలు ప్రారంభమవుతున్నాయట. ఆకాష్ ఫోను బిల్లు కూడా బాగానే అవుతోందట. మరి పప్పన్నం త్వరలోనే పెట్టేస్తారేమో చూడాల్సిందే మరి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment