శివపుత్రుడు ఫేమ్ బాల దర్శకత్వంలో ఎంతో హైప్ క్రియోట్ చేస్తూ వచ్చిన నేనూ దేవుణ్నే సినిమా మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.కథలో గంగ తీరంలో ఉత్తర కాశీలో జరిగే ఈ కథ అఘోరా సాధువుల చుట్టూ జరుగుతుంది. అక్కడ కాల భైరవుడు(ఆర్య) ఉంటూంటాడు. అతను చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వస్తారు. అయితే అతని తండ్రి,సోదరి వెతుక్కుంటూ పధ్నాలుగు సంవత్సరాల తర్వాత వస్తారు. అతని గురువు భైవర తో మాట్లాడి అతన్ని తమతో పాటు తీసుకెళతారు. అయితే అఘోరాగా మారిన అతనికి ఏ విధమైన ఎమోషన్స్ ,భంధాలు ఉండవు.దాంతో రకరకాల సమస్యలు వస్తాయి.ఆ పరిస్దితుల్లో వారితో ఉండలేక దగ్గరలోని గుడికి మకాం మారుస్తాడు. అక్కడ అంతా వికలాంగులైన ముస్టివాళ్ళు ఉంటారు.తన స్వార్ధం కోసం వాళ్ళను ఆ స్ధితికి తెచ్చిన తమన్దేవ్ అనే విలన్ ఉంటాడు. అలాగే అక్కడ గుడ్డి బిచ్చగత్తె(పూజ) పరిచయమవుతుంది. ఆమె ఓ సింగర్. ఆమె అనుకోని పరిస్ధితుల్లో మన హీరోని సహాయం కోరుతుంది. అతను ఆమెను దుర్మార్గులనుండి రక్షిస్తాడు. దాంతో పగపట్టిన విలన్ ...భైరవపై ఏ విధంగా పగ తీర్చుకున్నాడు. చివరికేం జరిగిందన్నది మిగతా కథ. ఇక కథగా ఓ మాదిరిగా ఉన్నా స్క్రీన్ ప్లే సరిగా లేకపోవటం,లింక్ లు సరిగా లేకపోవటంతో చూసే వారికి అది టార్చర్ పెట్టిందంటున్నారు. దానికి కారణం సినిమా అర్ధగంటకు పైగానే ట్రిమ్ చేయటమేనని తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment