
కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ కు ఈ నెల 16వ తేదీన...శస్త్రచికిత్స చేయనున్నారు. ఇక్కడి బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో ఈ చికిత్స జరుగుతుందని ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి.షారూక్ భుజానికి శస్త్రచికిత్స చేయడం ఇది రెండోసారి. గత నవంబర్‌లో 'దుల్హా మిల్ గయా' చిత్రం చిత్రీకరణ సమయంలో ఎడమ భుజానికి గాయం కావడంతో లండన్‌లో ఆపరేషన్ నిర్వహించారు. తాజా శస్త్రచికిత్స అనంతరం షారూక్ కనీసం రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.
No comments:
Post a Comment