Friday, February 6, 2009
మనసున్న మా రాజు అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ఓ పేరొందిన చిల్డ్రన్ హాస్పటిల్ ఎమర్జన్సీ వార్డులో జరుగుతోంది. అల్లు అర్జున్, కాజల్, నవదీప్ సీరియస్ గా సీన్స్ లో ఇన్వాల్స్ అయి చేస్తున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటనకు యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి మానవత్వం నిరూపించుకున్నారు. ఆ వివరాలు ఇట్లా ఉన్నాయి. ఆ ఆస్పటిల్ కి ఏదైనా ఎమర్జన్సీ కేసు వస్తే బయిటకు వెళ్ళాల్సి ఉంటుందని హాస్పటిల్ వర్గాలు చెప్పారు.
అయితే అప్పటివరకూ అలాంటిదేమీ లేదు. హఠాత్తుగా ఓ కుటుంబం ఓ రెండేళ్ళ పిల్లాడని తీసుకుని వచ్చారు.ఆ పిల్లవాడు క్రిందట్టి మీదట్టు గా శ్వాస పీల్చటమే కష్టంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు రాగానే ముందనుకున్నట్లు ఘాటింగ్ ఆగిపోయింది. దాంతో అంతా ఆగి క్యూరియాసిటీగా ఆ పిల్లాడిని చూస్తున్నారు. డాక్టర్స్ చెక్ చేసి చాలా కష్టమన్నారు. ప్రయత్నించాలన్నా చాలా ఖర్ఛవుతుందని..ముందు ఇరవై వేలు పెడితే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేస్తామని హాస్పటిల్ రూల్స్ చెప్పారు. వాళ్ళు బిక్కమొహం వేసుకు చూస్తున్నారు. అప్పుడు డాక్టరు వైద్య పూర్తయ్యేదాకా ఖరీదైన మందులు అవసరమవుతాయని రోజుకు మినిమం ముఫ్పై వేలు దాకా ఖర్చు అవుతుందని మరో బాంబు వేసాడు.
ఆ పరిస్ధితుల్లో ఇదంతా వింటున్న అశోసియేట్ డైరక్టర్ కాశీ విన్నాడు. విషయాన్ని సుకుమార్ కి చేరేసారు. అంతేగాక తనవంతు సాయంగా ఐదు వేలు ఇచ్చాడు. సుకుమార్ కూడా పదివేలు ఇచ్చాడు. వెంటనే ఇదంతా తెల్సుకున్న బన్ని(అల్లు అర్జున్)మరో నలభై వేలు ఇచ్చాడు. మొత్తం అలా ఓ అరగంటలో అంతా పోగుచేస్తే దాదాపు లక్షా పదివేలు దాకా వచ్చింది. ఆ మొత్తాన్ని ఆ కుటుంబానికి ఇచ్చి వైద్యాన్ని ప్రారంభించమన్నారు. అలాగే ఇంకా ఎక్కువ ఖర్చయితే మొత్తం తాను భరిస్తానని అల్లు అర్జున్ అభయమిచ్చాడు. అనంతరం రెండు రోజులుకు ఆ పిల్లాడు ప్రాణంతో బయిటపడ్డాడు. వారు సంతోషంతో ఆదిత్యా ఆర్ట్స్ యూనిట్ సభ్యులను పేరుపేరునా పలకరించి సంతోషపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment