
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమి చేసినా సంచలనమే. అంత అభిమానగణమున్నా ఆయన హిమాలయాలకు వెళ్లడం, కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం అన్నీ వింతగానే అనిపిస్తాయి. అయితే అదంతా ఆయన వ్యక్తిగత విషయం. ఓ కుమార్తెకు పెళ్లయింది. మరో కుమార్తె దర్శకురాలిగా బిజీగా ఉంది. ఆమె దర్శకత్వంలో రజనీ చేస్తున్న సినిమాకు సంబంధించిన పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. భార్య లత, కుమార్తెలు మనవడితో గడిపే సమయాన్ని తప్పించి మిగిలిన సమయంలో రజనీకాంత్ పూజలు, పునస్కారాలు చేస్తుండేవారు. అయితే ఇటీవల రోబో సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి తలైవాకు కొన్ని అదనపు అలవాట్లు కూడా వచ్చాయి. అవేమిటంటే ప్రతి రోజూ కనీసం గంటసేపయినా ఈతకొడుతున్నారు. షూటింగ్ లేని సమయాల్లో రోజుకు రెండుమూడు సార్లు ఈత కొడుతున్నారు. అదే షూటింగ్ ఉన్న రోజుల్లో అయితే ఒకసారి చేసి మరో సారికి సింపుల్గా వార్మప్ చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తి కడుపు సంబంధించిన వ్యాయామాలను రజనీకాంత్ అధికంగా చేస్తున్నారని సమాచారం. ఆయన ఇటీవల కాస్త యవ్వనంతో కనిపించే సీక్రెట్ అదేనట.
No comments:
Post a Comment