నాగార్జున కింగ్ సినిమా తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. అయితే ఆయన ఇప్పటికే ఓ పాపులర్ దర్శకుడు డైరక్షన్ లో నటించటానికి నిర్ణయం తీసుకున్నాడని,అదే ఫైనలైజ్ అవ్వచ్చునని అని కొందరంటున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు మురగదాస్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గజనీ చిత్రానికి పనిచేసిన ఆయనకి అంతటా హెవీ క్రేజ్ వచ్చింది. అయితే అతను ఇంకా ఏ సినిమాకూ కమిట్ కాలేదు. ఈలోగా ఎప్పుడో నాగార్జునకి వినిపించిన కథ గురించి మురుగదాస్ కి ఫోన్ చేయటం,అతను హైదరబాద్ లో వాలిపోవటం జరిగిందిట. గతంలో చిరంజీవితో సినిమా చేసేటప్పుడు మురుగదాస్ ఇక్కడ చాలా మంది హీరోలను కలిసాడుట.అలా విసిరిన రాయిల్లో ఒకటి నాగార్జునట. అప్పుడు పెద్దగా పట్టించుకోని నాగార్జున ఈ మధ్య గజనీ చూసి ఫోన్ చేసి మొచ్చుకున్నాడని సమాచారం. ఇక నాగార్జునకు చెప్పిన కథ ను రొమాంటిక్ కామిడీగా చిత్రం రూపొందిస్తానని మురగదాస్ అన్నాడని,కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా మిక్స్ చేస్తే బావుంటుందని నాగ్ సూచించటం,దానికతను వెంటనే ఒప్పుకోవటం జరిగిందంటున్నారు. అయితే మురగదాస్ ఈ విషయంపై ఏమీ స్పందించటం లేదు. ఇంతకు ముందు కూడా బోయపాటి, శేఖర్ కమ్ముల, గుణశేఖర్ దర్శకత్వంలో నాగార్జున చేసే అవకాశం ఉందని టాక్స్ వచ్చాయి...కానీ అవేమీ మెటీరియలైజ్ కాలేదని, ఇప్పుడు ఇదైనా అవుతుందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అవకపోవటానికి అడ్డంకేమీ లేదు...మురగదాస్ కమిట్ మెంట్ తప్ప. కాబట్టి ఏదైనా ఎక్సపెక్ట్ చేయవచ్చు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment