Thursday, February 12, 2009
గెస్ట్ పాత్రలో మహేష్
మొన్న జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు తాజగా కావ్యాస్ డైరీలో గెస్ట్ రోల్ లో కనపడనున్నాడని సమాచారం. అతిధి సినిమా అనంతరం మహేష్ ఇప్పటివరకూ సినిమా చేయకుండా ఇలా అతిధి పాత్రలు చేయటం అభిమానులకు మింగుడుపడటం లేదు. మరో ప్రక్క గౌతమ్ మీనన్ స్క్రిప్టు రెడీ అవుతోంది, త్రివిక్రమ్ సినిమా త్వరలో మొదలవుతోందంటూ మహేష్ ఊరిస్తున్నాడు గానీ ప్రారంభించటం లేదు. అతిధి పరాజయంతో స్క్రిప్టు పట్ల జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడని అందుకే లేటవుతోందని అంటున్నారు. ఇక కావ్యాస్ డైరీలో మంజుల,ఛార్మీ జంటగా నటిస్తున్నారు.
ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై కావ్యాస్ డైరీ నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వీకే ప్రకాష్ దర్శకత్వంలో సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. శశాంక్, సత్యం రాజేష్, ఇంద్రజిత్లు కూడా నటించిన ఈ చిత్రానికి శ్యామ్దత్ కెమెరా బాధ్యతలు చేపడుతుండగా, మను రమేశన్ సంగీతం అందిస్తున్నారు. వక్కంతం వంశీ మాటలు అందిస్తుండగా, మహేష్ నారాయణన్ ఎడిటింగ్, అనంత్ శ్రీరామ్ పాటలు, విజయ్ ఫైట్స్ సమకూరుస్తున్నారు. ఇక మహేష్ గెస్ట్ పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని భావిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment