ప్రముఖ కమిడియన్ ఏవీయస్ కి ఆ మధ్య కాలేయం ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు గ్లోబుల్ ఆస్పత్రిలో జరిగిన ఆ ఆపరేషన్ కి సహాయం అందించింది ఇద్దరుట. ఒకరు విసు కన్సల్ టెన్సీ అధినేత సి.సి.రెడ్డి, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి.చిరంజీవి ఆ ఆపరేషన్ కి ఐదు లక్షలు రూపాయలు దాకా సహాయం అందించారు. ఈ విషయాన్ని అప్పట్లో స్వయంగా ఏవీయస్ స్వయంగా మీడియాతో చెప్పారు.కానీ ఇప్పుడు ఏవీయస్...లోకం కోడై కూస్తోంది పేరుతో తెలుగు దేశం ప్రచార ప్రకటనలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రేస్ రాజశేఖర్ రెడ్డని,చిరంజీవిని విమర్శిస్తున్నాడు. ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ ఎండకా గొడుగు పట్టే వాళ్ళను చూసాం కానీ మరీ ఇంత బరితెగుంపు ప్రకటన లా ,అది ప్రాణాలను ఆదుకున్న వారినీ ఇలా తూలనాడటం నీకు సహజమేమో గాని అన్ని తెలిసి చూసే జనాలకి ఇది సమంజసం గా అనిపియదు అని అంతా అనుకుంటున్నారు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment