ఆ మధ్య శ్రియకు తిరుపతిలో జరిగిన అనుభవమే...నిన్న ఖుష్భూకి ఎదురైంది. నిన్న చెన్నైలో హాస్య నటుడు నగేష్ అంతిమ యాత్ర జరుగుతూండగా ఆ సంఘటన చోటో చేసుకుంది. ఉదయం 11 గంటలకు ఓ వాహనంలో నగేష్ భౌతికకాయాన్ని తీసుకెళుతుండగా వందలాది జనం గుమికూడారు....ఖుష్బూ ఇంటి గేటువద్ద నిల్చుని చూస్తూ ఉంది. ఈ లోగా ఎవరో ఆకతాయి ఆమె వెనుక నుంచి వచ్చి జుట్టు పట్టుకు లాగారు. దీంతో ఆమె బిగ్గరగా కేకపెడుతూ, బూతులుతో దూషించింది. ఇక ఎటు చూసినా జనం కావటంతో ఆ పని చేసిన వారిని గుర్తు పట్టడం కష్టమయింది.
అయితే తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కోపంతో ఆమె భర్త, నట-దర్శకుడు సుందర్ ఎదురుగా ఇద్దరు వ్య క్తులపై దాడిచేశారు.వాళ్ళు మాకే పాపం తెలియదని వారు గగ్గోలు పెడుతున్నా ఎడాపెడా చెంపలు ఛెళ్లుమనిపించాడు. అంతేగాక పోగయిన మిగతా జనం కూడా ఖష్భూ దగ్గర మార్కులు కొట్టేయటానికి మరో నాలుగు దెబ్బలు వేసారు.అయితే అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి అప్పుడే ఉడాయించాడని,ఏమీ తెలియని తమపై సుందర్ చేయి చేసుకున్నారని వారు వాపోయారు.ఇక ఈ సంఘటన నిన్న చెన్నై చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇక నగేష్ అంతిమయాత్రలో కమల్ హాసన్, మనోరమ, షావుకారు జానకి, స్నేహ తదితర ప్రముఖులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment