
హాట్ గర్ల్ ఛార్మి తాజాగా అజయ్ (విలన్ వేషాలు వేసే)కి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సయ్యాట అనే టైటిల్ ని పరిశీలుస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఛార్మి నటించిన 16 డేస్, కావ్యాస్ డైరీ, మాయగాడు చిత్రాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. అజయ్ తో రాజమౌళి శిష్యుడు కన్నన్ రూపొందిస్తున్న సారాయి వీర్రాజు కూడా పూర్తి కావొస్తోంది. వీటితో పాటు అజయ్ హీరోగా మరోరెండు చిత్రాలు కూడా కమిట్ అవుతున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment