
ఆదివారం..అర్ధరాత్రి రెండు గంటలకు పోలీసుల రాకతో ప్రీతిజింతా కలవరపడింది.ఆ రాత్రి ఆమె తన పుట్టిన రోజు సందర్బంగా తన ప్లాట్ లో (ముంబయి...బంద్రా-క్వాంటమ్ పార్క్ బిల్డింగ్ లో)పార్టీ ఏర్పాటు చేసింది. అందుకు తగినట్లుగా ఆమె పెద్ద సౌండ్ తో లౌడ్ స్పీకర్ లో పాటలు పెట్టింది. ఇవి ఆ ప్రక్క నున్న స్లమ్ ఏరియా జనానికి నచ్చలేదు. శబ్ద కాలుష్యానికి దిగిందంటూ ఆమెపై పోలీసు కేసు పెట్టారు. అంతే రాత్రి రెండు గంటలకు తన పటాలంతో ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగారు.ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఆ సౌండ్స్ ని కట్ చేయించారు. ఇంతకీ ఎప్పుడో ఒక్కసారి వచ్చే పుట్టిన రోజు కదా ఎందుకింత కోపం అని మూగిన మీడియా వారు ఆ స్లమ్ వారిని అడిగారు.అప్పుడు వాళ్ళలో కంప్లైంట్ ఇచ్చిన ఇర్ఫాన్ షేక్ అనే అతను ముందుకొచ్చి...గతంలో తాము తమ పండుగలకు,పబ్బాలకు ఎప్పుడన్నా ఓ మైక్ పెట్టుకుంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలిసులతో వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆమె హంగామా చేస్తే మేమెందుకు ఊరుకుంటాం అని ఎదురు ప్రశ్నించాడు. సరే పోలీసులు వచ్చారు కదా మీ సమస్య తీరినట్లేన అంటే వాళ్ళు నిట్టూరుస్తూ..వాళ్ళటు వెళ్ళగానే ఆమె అంతకు ముందుకన్నా సౌండ్ మరింత పెంచింది అంటూ వాపోయారు. ఇక ఈ పార్టీకి షారూఖ్ ఖాన్, ఫరాఖాన్, చుంకీపాండే తదితరులు వచ్చారు.
No comments:
Post a Comment