
తెలుగుదేశం పార్టీ అధిష్ఠానవర్గం కోరుకుంటే భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి పదవిని చేపడ్తానని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. కర్నూలు జిల్లాలో తన పర్యటనను ముగించుకున్న బాలకృష్ణ బుధవారం ఉదయం కర్నూలులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అవుతారా అని విలేకరులు అడగ్గా ఆ విషయం తానెల చెప్తానని, పార్టీ అధిష్ఠానవర్గం కోరుకుంటే అవుతానని ఆయన చెప్పారు.ప్రజలకు సేవ చేసే సమయం వచ్చింది కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. రెండు జిల్లాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాను సేవామార్గం పడుతానని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment