ప్రస్తుతం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న సినిమా స్లమ్ డాగ్. ఈ చిత్రంకి ఆస్కార్ రాకుండా చేయటానికి భయంకరమైన కుట్ర జరుగుతోందని తెలుస్తోంది. ముంబయి మురికివాడల నేపధ్యంలో కొన్ని జీవితాలని, వాస్తవాలను స్పృశిస్తూ...కౌన్ బనేగా కరోడ్ పతి తరహా గేమ్ ని కలిపి టెన్షన్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకున్న చిత్రం ఇప్పటికే పది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో పాటు మరో నాలుగు రిచెర్డ్ అటెన్‌బరో సినిమా పురస్కారాలను సైతం అందుకుంది.మరో ప్రక్క సినీ విమర్శకులు ముక్త కంఠంతో ఈ చిత్రానికి తప్పని సరిగా ఆస్కార్ వస్తుందని చెప్తున్నారు.
ఇది తట్టుకోలేని..కొన్ని శక్తులు ఈ చిత్రానికి ఆస్కార్ దక్కకుండా చేయడానికి కుట్ర జరుపుతున్నారని అమెరికా, బ్రి టన్‌లలోని వార్తా పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి. ఈ కుట్రలో భాగంగానే ఈ చిత్రంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వారి వాదన. స్లమ్ డాగ్ లో నటించిన బాల నటులకు సరైన వేతనం చెల్లించకుండా నిర్మాతలు వారి శ్రమను దోపిడీ చేశారని.. గొడవ రేపటం ఈ వ్యూహంలో భాగమే నంటున్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమాలపై తమ తీర్పు చెప్పాల్సిన అకాడెమీ సభ్యులు ఈ వారమే ఓటింగ్ పేపర్లను అందుకున్నారు. వారిదృష్టిలో 'స్లమ్‌డాగ్'ను తక్కువచేసి చూపడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని 'ఇండిపెండెంట్' అనే పత్రిక పేర్కొంది.
ఇదిలా ఉంటే ప్రముఖ బాలివుడ్ దర్శకుడు ప్రియదర్శన్ తాజాగా ఈ చిత్రాన్ని విమర్శిస్తూ కామెంట్ చేసారు. ''ఆస్కార్‌కి పోటీ పడుతున్న 'స్లమ్‌డాగ్'కి ఆ స్థాయి లేదు. వరల్డ్ సినిమా జాబితాలో చోటు చేసుకొనే లక్షణాలు లేవు. ఎందుకంటే అదో సాదాసీదా చిత్రం. ఇంకా చెప్పాలంటే చెత్త చిత్రం. వికాస్ స్వరూప్ రాసిన 'క్యూ అండ్ ఎ' నవల నేను కూడా చదివాను. ఆ నవలను సినిమాగా తీయాలని మణిరత్నం కూడా అనుకున్నారు.
డానీ ముంబయి మురికివాడలను, అక్కడి వారి జీవనాన్ని చూపించిన తీరు కూడా సబబుగా లేదు. ఆయనకు ముంబయిలోని అందం ఏ కోశానా కనిపించినట్లు లేదు. అసలు ఇలాంటి కథాంశాల్ని మన సలీమ్-జావేద్‌లు ఇంతకంటే గొప్పగా రాశారు'' అని విమర్శించారు. అలాగే ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సల్మాన్ రష్దీ లాంటివాళ్లు ఆ చిత్ర దర్శకుడు డానీ బోయెల్ చిత్రీకరణ శైలిని తప్పుబట్టారు. భారత దేశంలోని పేదరికాన్ని బజారులోపెట్టి అమ్ముకొనే ప్రయత్నం జరిగిందని అన్నారు.
ఏవి ఎలా ఉన్నా మెజారిటి ప్రజలు మాత్రం స్లమ్ డాగ్ కి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అందులో మన ఏఆర్ రహమాన్ పనిచేసాడు..అలాగే మన ఇండియన్ రచయిత రాసిన నవలకి సినిమా రూపం అది. అలాగే మన దేశం షూటింగ్ జరుపుకున్న హాలీవుడ్ చిత్రం అది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment