ఆ మధ్య ఆర్.నారాయణ మూర్తి... దేవరకొండ వీరయ్య..అనే సినిమాని...కూతురు కోసం అనే ట్యాగ్ లైన్ పెట్టి రిలీజ్ చేసారు. అయితే అస్సలు వర్కవుట్ కాలేదు. క్షౌరవృత్తి చేసుకునే వారి బ్రతుకు తెరువు,సమస్యల నేపధ్యంలో ఆయోషా హత్య కేసు కలిపి ఈ చిత్రాన్ని నిర్మించారు. కథన సమస్య ఈ సినిమాకు అప్పట్లో మైనస్ అయ్యి మహా నసగా మిగిలి ప్రేక్షకులకు దూరం అయింది. అయితే నారాయణ మూర్తి మాత్రం టైటిల్ సరిగా పెట్టకపోవటం వల్లే సినిమా పోయిందని భావించి...ఈ సారి దాన్ని మార్చి రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment