దేవుడి ఆశీర్వాదం ఉంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం బాపు ఘాట్ వద్ద ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిరంజీవి విలేఖరులతో మాట్లాడుతూ..అంతర్జాతీయంగా గొప్ప గొప్ప నాయకులకే గాంధీ నాయకుడని, మండేలా, ఒబామా తదితరులకు గాంధీయే ఆదర్శం కావడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.యువతలో ఇంకా గాంధీ భావాలు ఉన్నాయనడానికి 'లగేరహో మున్నాభాయ్' వంటి సినిమాలు హిట్ కావడమే నిదర్శనమన్నారు. పొత్తుల విషయంలో బంతి టీఆర్‌ఎస్ కోర్టులోనే ఉందని, అత్యధిక స్థానాలను ఇస్తామని తాము ప్రతిపాదించామని తెలిపారు. నిజామాబాద్‌లో 'చిరు' పర్యటన 1 నుంచి11 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నాలుగు రోజులపాటు చిరంజీవి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.ఒకటో తేదీన హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి 11 గంటలకు బిక్కునూరు చేరుకుంటారు. అక్కడ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. మరోపక్క, ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తీసుకొచ్చే విషయమై 2003 అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్ చేసిన వైఎస్...ఇప్పుడు దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని కోరుతూ పీఆర్పీ నాయకుడు పడాల భూమన్న శుక్రవారం వైఎస్‌కు లేఖ రాశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment