Friday, January 30, 2009
త్రిష వెంకి లా మరో తాజా చిత్రం
వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించనున్న చిత్రం దాదాపు ఖరారయినట్లే నని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ముహూర్తం చేసి, ఏప్రియల్ నుండి రెగ్యులర్ షూటింగ్ కి ప్లన్ చేస్తున్నారు. ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా తీసిన గిరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు.
ఈ చిత్రంలో శ్రీను వైట్ల చిత్రాలలోగానే బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనపించనున్నట్లు సమాచారం. పూర్తి క్లీన్ ప్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకటేష్ దీన్ని రూపొందించాలని శ్రీను వైట్లకు చెప్పారని తెలుస్తోంది. ఇక క్రిష్,వెంకటేష్ ల కాంబినేషన్ సినిమా ఇంకా రెడీ కాలేదు. క్రిష్ ఇంకా కథపైనే కుస్తీ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నలుగురు కుర్రాళ్ళు..వాళ్ళను ఉత్తేజపరిచే ఎన్నారైగా క్రిష్ ఈ కథను తీర్చిదిద్దారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ కి పూర్తి స్ధాయి సంతృప్తి ఇవ్వలేదని, ఇంకా ఎంటర్టైన్ మెంట్ కావాలని,కలపమని చెప్పటంతో అదే పని మీదే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ లోగా వెంకీ..శ్రీను సినిమాను పూర్తి చేసేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment