ప్రముఖ సినీనటి ఊర్వశి అవార్డు గ్రహీత, మాజీ ఎంపి శారద త్వరలో క్రీయాశీలక రాజకీయ రంగ ప్రవేశం చెయ్యబోతున్నారు. హీరోయిన్స్ అంతా రాజకీయాల్లోకి వచ్చి హంగామా చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలనుకున్నారో ఏమో తాను త్వరలో క్రీయాశీలక రాజకీయ రంగ ప్రవేశం పేర్కొన్నారు. గురువారం ఆమె సత్యసాయి బాబా దర్శనార్థం పుట్టపర్తికి విచ్చేశారు. బాబా దర్శనార్థం ఆమె ప్రశాంతి నిలయంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది రోజులలోపే రాజకీయ అరంగ్రేటం చేయనున్నానని అందుకు బాబా ఆశీస్సుల కోసం పుట్టపర్తికి విచ్చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రారంభించిన వైనాన్ని ఆమె స్వాగతిస్తూ అదే తరహాలోనే సినీ నటుడు బాలకృష్ణలో చక్కటి సాన్నిహిత్యం ఉందన్నారు. దీంతో శారద రాజకీయ పయనం ప్రజారాజ్యమా? తెలుగుదేశమా? అన్నది పది రోజుల్లో తేలనున్నది. తాను గతంలో గుంటూరుజిల్లా తెనాలి పార్లమెంట్ సభ్యురాలిగా పని చేసినందున ఆ ప్రాంతంలో నేటికీ సంబంధాలు కొనసాగిస్తున్నానని, దీంతో పాటు వెంకటగిరి నియోజకవర్గంపై కూడా ప్రత్యేక దృష్టి నిలిపానన్నారు.మరి ఈ రెండు పార్టీలు కాకుండా ఏ కాంగ్రేస్ లోనో చేరి ట్విస్టు ఇస్తుందేమో చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment