సినీ నటుడు, తెలుగు దేశం నేత బాలకృష్ణపై పుటపర్తి పోలీసులు కేసు నమోదు చేసారు. రాత్రి పదిగంటలు దాటిన తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు.అయితే బాలయ్య పుటపర్తిలో రాత్రి పదిదాటిన తర్వాత కూడా ప్రసంగించటంతో పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. బాలకృష్ణ గత రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇక చట్టప్రకారం రాత్రి పదిగంటలు వరకే పర్మిషన్ ఉండటంతో కేసు పెట్టవలిసి వచ్చిందని పోలీసులు వివరిస్తున్నారు. అంతేగాక మైకులను ఉపయోగించి ప్రసంగించకూడదు. దీన్ని కూడా ఉల్లంగించారని కేసు ఫైలు అయ్యింది. ఇంతకుముందు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మీద కూడా ఇటువంటి కేసులు నమోదు అయ్యాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment