కరీనాకపూర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఓ దశాబ్ధం పూర్తి కావస్తోంది. కపూర్ ఖాన్‌దాన్ నుంచి వచ్చిన ఈ కన్యకామణికి బాలీవుడ్గలో మిత్రులా కంటే శత్రువులే ఎక్కువ! కళ్లు తిప్పుకోనివ్వని అందచందాలతోపాటు, కపూర్ కుటుంబం అండదండలు పుష్కలంగా కలిగి ఉన్నందున, నిన్నటి వరకూ `ఎవరైతే నాకేంటి' అన్న రీతిలో తలబిరుసుగా నడుచుకున్న కరీనా.. ఇప్పడిప్పుడు అందరితోనూ మంచిగా ఉంటుండడమే కాకుండా గతంలో తగవులు పెట్టుకుని ఎడమొహం పెడమొహంగా ఉంటున్నవారితోనూ స్నేహసంబంధాలు పునరుద్ధరించుకుంటుడడం బాలీవుడ్గలో చర్చనీ యాశంగా మారింది. గతంలో తన సోదరి (కరిష్మా) ప్రియుడైన సల్మాన్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చిన కరీనా, ఇటీవల అతనితో సంధి కుదుర్చుకుందని సమాచారం. పనిలోపనిగా మునుపు తను తగా దా పడిన బిపాసాబసు, రాణీముఖర్జీ, ఇషా డియోల్ వంటి వారితోనూ సత్సం బంధాలు నెలకొల్పు కునేందుకు కరీనా కృషి చేస్తున్నదని తెలుస్తోంది. వయసుతో పాటు మానసిక పరిణతి పొందడం ఎవరికైనానా సహజమే కదా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment