Friday, January 30, 2009
నీతుని బెదిరించాను "రాజ్ శేఖర్"
నీతూ చంద్ర కు వార్నింగ్ ఇచ్చిన మాట నిజమేనని రాజశేఖర్ సత్యమేవ జయితే ఆడియో పంక్షన్లో ఒప్పుకున్నారు.అయితే అందులో ఆమె చెప్పినట్టు తను కొట్ట లేదు అని చెప్పారు.అనుచితంగా ప్రవర్తించలేదు. వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం. యూనిట్ మొత్తం షూటింగ్ స్పాట్ లో సిద్ధంగా ఉంటే నీతూ చంద్ర ఫోన్ ఆఫ్ చేసుకుని మేకప్ రూంలో కూర్చుంది.
నాకు కడుపు మండి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. ఇలా ప్రవర్తిస్తే తెలుగులోనే కాదు...సౌత్ ఇండియాలో ఏ భాషలోనూ చేయలేవని గట్టిగా చెప్పాను.పరిస్ధితిని వివరించాను. ఆమె కూడా అర్ధం చేసుకుని వచ్చి నటించి వెళ్ళింది. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు.ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం.ఆ మాత్రం మందలించే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment