బాలయ్య తెలుగుదేశం పార్టీ ప్రచార నిమిత్తం పర్యటనకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అందు నిమిత్తం అనంతపురంలో బ్యానర్స్ అంతటా కట్టారు. అయితే అక్కడి కలెక్టర్ ఆఫీసు దగ్గర బాలకృష్ణ బ్యానర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఇక ఈ విషంయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు తమ కార్యకర్తలును సంయమనం పాటించమని కోరినట్లు సమాచారం. అలాగే రేపు జరిగే బాలకృష్ణ యాత్రను విజయవంతం చేయటం పైనే దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రాద్దాంతం చేయటం అనవసరమని తెలుగుదేశం భావిస్తోంది.మరో ప్రక్క బాలయ్య ప్రచారం టూరు వివరాలు,బాధ్యతలను మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు చూస్తున్నారు. పర్యటన ఏర్పాట్లను మాగంటి గోపీనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక బాలయ్య పర్యటన కోసం ప్రచార రథం యభై మంది పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. రోడ్‌షోల్లో యాభై వేల మందిని ఉద్దేశించి మాట్లాడేందుకు అనుగుణంగా లక్ష వాట్లతో అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణల ఫొటోలుండే తెల్లటీ షర్టు, జీన్స్ ప్యాంటుతో వాలంటీర్లకు ప్రత్యేక దుస్తులను రూపొందించారు. వాలంటీర్ల బృందం మంగళవారం బాలయ్యను కలిసి హిందూపూరం బయల్దేరి వెళ్ళనుంది.ఏది ఏమైనా ఇది హర్షించ తగ్గ చర్య కాదు అంతం ..మరి మీరేం అంటారు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment