Thursday, January 29, 2009
ఒంటరీ గా సెలీనా జైట్లీ
ఇక ఈ వయసులో నేను పెళ్లివంటి కమిట్‌మెంట్స్ కావాలని కోరుకోవడం లేదు. కానీ జీవితంలో ప్రేమకు మాత్రం తలుపులు తెరిచివుంచా. ప్రేమలో పడటమనే భావనను నాకిప్పుడు కావాలి అంటూ కవిత్వం చెబుతోంది మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ సుందరాంగి సెలీనా జైట్లీ. దాదాపు మూడున్నరేళ్లుగా నేను ఒంటరిగానే ఉన్నా. నాతో జీవితం పంచుకునే వ్యక్తి ఎవరో నాకు తెలీదు. కానీ అతను నాకు చాలా దగ్గరగా ఉన్నాడనే భావన నాలో కలుగుతోంది. గత నెల రోజులుగా అలాంటి ఫీలింగ్ ఉంది. త్వరలోనే నేను ప్రేమలో పడతాననేది నా నమ్మకం'' సోయగాలు పలుకుతోందామె.సెలీనా జైట్లీ మంచి తోడు కోసం ఎదురుచూస్తున్నానని చెప్తోంది. మూడేళ్ల నుంచీ తన జీవితంలో ప్రేమ లేకపోవడంతో బోరు కొట్టిందని అంటోంది. ఆ మధ్య ఈ సుందరాంగి కాలిఫోర్నియాకు చెందిన షాన్ టీగ్‌తో రెండున్నరేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఆ బ్రేక్ అప్ ఎందుకనో ఒంటరిగా మిగిలిపోయింది. ఖాళీగా ఉందికదా అంటూ ఈ మధ్యలో తోటి నటులతో ఆమెకు సంబంధాలు అంటగడుతూ ప్రచారాలు జరిగాయి. అయితే వాటినన్నిటినీ తోసిపుచ్చిన ఆమె షాన్ తర్వాత తనెవరితోనూ అనుబంధాన్ని నెలకొల్పుకోలేదని స్పష్టం చేస్తూ చెప్పుకొచ్చింది. ఇప్పటికిప్పుడు పెళ్లి ఆలోచనలు లేకపోయినా, మరోసారి ప్రేమలో పడేందుకు ఆమె సిద్ధంగా ఉన్నానని తెల్పింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment