లింగుస్వామి దర్శకత్వంలో 'షుమన్' అనే తమిళ చిత్రంలో నయనతార మొదటి హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ తర్వాత చిత్ర దర్శక, నిర్మాతలు నయనతార స్థానంలో త్రిషను ఎంపిక చేశారు. దీనికి కారణం ఉందని ఆ చిత్ర యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.ఈ మధ్యకు పెద్ద గా హిట్స్ లేనందుకు పారితోషకం తగిస్తాను అన్నాడు ఆ నిర్మాత దానికి నయన ఒప్పుకోక అత్యధిక పారితోషికం డిమాండ్ చేసిందనీ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో ఎవరికివారు రెమ్యూనరేషన్ కాస్తంత తగ్గించుకుంటుంటే ఆమెగారు మాత్రం "తాబట్టిన కుందేలు"కు మూడేకాళ్లన్న ధోరణితో పారితోషికాన్ని పెంచుతూ పోతోందిట. దీంతో ఆమెను తప్పించి సహకార ధోరణితో పోతున్న త్రిషను ఎంపిక చేశారట.అయితే దీనిపై నయనతార గరం గరంగా ఉందట. మొదటగా తనను ఎంపిక చేసి ఆ తర్వాత త్రిషను ఎంపిక చేయడంవల్ల తన పరువు కాస్తా గంగలో కలిసిందని, అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.35 లక్షలు తిరిగి ఇచ్చేది లేనేలేదని నిర్ణయించుకుందట. దీంతో ఆగ్రహించిన నిర్మాతలు ఆమెపై ఇటు తమిళ కౌన్సిల్‌తోపాటు అటు తెలుగు చలనచిత్ర రంగంలోని కౌన్సిల్‌కి కూడా నయనకు సహకరించకూడదని మొరపెట్టుకున్నారట.
ఈ గొడవల కు నయన బాగా దిస్తుర్బ్ అయింది అంట.మన ఎన్.టీ.ఆర్ ఎంతో అభిమానం తో ఇలియానా ని పకన పెట్టి మరీ నయన ని తీసుకునాడు.ఈ సినిమా తో అయిన నయన కి పథ రోజులు వస్తా ఏమో చూద్దాం
No comments:
Post a Comment