మహేష్ బాబు తాజాగా ఓ రిసార్ట్ ని గోవాలో నిర్మిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్మాణాన్ని మహేష్ భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటోంది. వాటికి మహేష్ రిసార్ట్స్ అనే పేరు పెడదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సినిమాలే కాకుండా వ్యాపార రంగంలోనూ తమకంటూ ఆస్ధులుండాలని ఆమె భావిస్తోందని సమాచారం. అంతేగాక కుటుంబంలో చిన్న చిన్న డిస్ట్రిబెన్స్ లు వచ్చాయని వాటి వల్ల ఆమె మహేష్ ని బాలీవుడ్ లో కూడా ట్రై చేయమంటున్నట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.అక్కడ సక్సెస్ అయితే ద్విబాషా చిత్రాల్లో చేసుకోవచ్చునని ముంబయిలో ఉండవచ్చునని ఆమె అంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇక అతిధి అనంతరం మహేష్ హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఏదైమైనా మహేష్ గట్టిగా ట్రైచేస్తే..బాలీవుడ్ లో సెటిల్ అవటం కష్టమేమి కాదని, అతను అక్కడి వాతావరణానికి, స్క్రీన్ ప్రెజెన్స్ కి చక్కగా సూటవుతాడని అంతా అంటున్నారు. అందుకే ఇక్కడ మహేష్ హిట్ లను అక్కడ డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
ఈ ప్లాన్ నిజం అయ్యి క్లిక్ అయితే కనుక మహేష్ ఇంకొక 10 ఇయర్స్ లో రజని స్థానం లో చేరుకుంటారు అంతం లో ఏమాత్రం సందేహం లేనే లేదు.కాని మహేష్ ఇంటర్వ్యు లో కొన్ని సార్లు తనకి అలాంటి ప్లాన్స్ ఏమి లేవు అని చెప్పటం జరిగింది ...
No comments:
Post a Comment