స్లమ్ డాగ్ ఓ ప్రక్క పురస్కారాలు, ప్రశంసలూ అంటూ దూసుకుపోతూ..అంతకంటే వేగంగా వచ్చే విమర్శలని ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజగా ఆ సినిమాలో లతికా, సలీం పాత్రలనుపోషించిన బాలనటులు రుబినా, అజహర్ ఇస్మాయిల్ శ్రమదోపిడీకి గురయ్యారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.'సినిమా బాగా డబ్బులు వసూలు చేస్తోంది. అందరికీ పేరు, గుర్తింపువస్తోంది. మాకుమాత్రం నామమాత్రంగా చెల్లించారు అంటున్నారు.ఇక క్షయ వ్యాధి బాధితుడైన అజహరుద్దీన్ ప్రస్తుతం దయనీయ జీవితం గడుపుతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్న కారణంతో వారి ఇంటిని కూల్చివేశారు. 'మా వద్ద డబ్బు లేదు. అంతా వైద్యానికే ఖర్చయింది. నిధి కేటాయించామని వారు చెప్పారు. దాని గురించి మాకు తెలియదు' అని అజహర్ తండ్రి మహ్మద్ ఇస్మాయిల్ అన్నారు.మరో బాలనటి రుబినా పరిస్థితిలోనూ పెద్దతేడా లేదు. ఆమె తండ్రి వండ్రంగి. చిత్ర నిర్మాణం సమయంలో ఆయన కాలు విరిగింది. అప్పటినుంచి ఆయన పనికిదూరమయ్యారు. నా కూతురికి ఎంత చెల్లించారో కూడా నాకు తెలియదు' అని రుబినా తండ్రి రఫీక్ అలీ ఖురేషీ చెప్పారు.అయితే అజహర్, రుబినాలపై తగినంత శ్రద్ధ వహించినట్లు చిత్ర దర్శక నిర్మాత డానీ బాయిల్, క్రిస్టియన్ కొల్సన్ చెప్పుకొచ్చారు. అలాగే ఆ పిల్లల చదువు కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని చిత్ర దర్శకుడు డానీబాయిల్ చెబుతున్నారు. పిల్లలకు తగిన మొత్తం చెల్లించామన్నారు. పాఠశాల ముఖం చూడని వారిద్దరు 2008 నుంచి విద్యాబుద్దులు నేర్చుకుంటున్నారు. ఖర్చును భరిస్తున్నట్లు వారు తెలిపారు. వాళ్ల చదువులు పూర్తయిన తర్వాత పెద్దమొత్తంలో డబ్బును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment