
హిందూపురం: అధిష్టానం ఆదేశిస్తే చిరంజీవిపై పోటీ చేస్తానని గురువారం సినీహీరో, టీడీపీ నేత బాలకృష్ణ ప్రకటించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిపైనైనా, పురందరేశ్వరిపైన అయినా పోటీకి తాను సిద్ధమని తెలిపారు. అయితే మిగిలిన నందమూరి వారసులెవరూ ఎన్నికల్లో పోటీ చేయబోరని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో తన తండ్రి ఎన్‌టిఆర్‌ను ఆదరించినట్టే ప్రజలు తనను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక కాంగ్రెస్ పాలనలో హింస పెరిగిందని, తెలుగువారి ఆత్మగౌరవం తిరిగి ఢిల్లీ వీధుల్లో సాగిలపడిందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని, టీడీపీ అఖండ విజయం ఖాయమని అన్నారు. తెలుగు దేశం పార్టీకు ప్రజలే వారసులని, చంద్రబాబుకి తప్ప ముఖ్యమంత్రి కాగల అర్హతలు మరెవ్వరికీ లేవనీ బాలకృష్ణ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment