Friday, January 30, 2009
కృష్ణ వంశీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలంటే
కృష్ణ వంశి తన దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేయాలనుకునే వారికి ఓ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆ పేపరు..లో ఉన్న అంశాలు ఇవి. రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది.
1.మీకు నచ్చిన సినిమా -(ఎందుకు)- పాత సినిమా-
నేటి సినిమా-
2. మీకు నచ్చిన దర్శకుడు -ఎందుకు
3.మీకు నచ్చిన పుస్తకం
4. మీకు నచ్చిన సంఘటన
5.మీకు నచ్చని సంఘటన
6.భవిష్యత్తులో దర్శకుడు అవ్వాలన్న మీ నిర్ణయానికి ఇప్పుడు మీరు చేస్తున్న హోమ్ వర్క్
7. మీకు ఎలాంటి సినిమా చెయ్యాలనుంటుంది
8.ఎంతవరకు చదవుకున్నారు..చదువు మన సినిమాకి ఉపయోగపడుతుందా
9.సినిమాల్లోని దర్శకత్వ శాఖ కాకుండా మిగతాశాఖలపై మీ అవగాహన
10. నేటి రాజకీయాలపై సగటు మనిషిగా మీ స్పందన.
పది నుంచి ఇరవైలైన్లకు మించకుండా
కృష్ణవంశీ గురించి కాకుండా
ఆసక్తి ఉన్నవారంతా కృష్ణవంశి ఆఫీసుకు వెళ్ళి అప్లికేషన్ తీసుకుని, వారిచ్చే ప్రశ్నలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రై చేసేవారికి బెస్ట్ ఆఫ్ లక్.
తాజాగా కృష్ణ వంశి శ్రీకాంత్ వందవ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. బెంగుళూరు కి చెందిన ఓ పారిశ్రామిక వేత్త ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. యాసిడ్ దాడిలో మరణించిన వరంగల్ స్వప్నిక కేసు ఆధారంగా ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ ఈ పనిలో ఉన్నారు. అలాగే ఈ సినిమా నిర్మాణానికి దాదాపు పన్నెండు కోట్ల దాకా ఖర్చుపెట్టనున్నట్లు చెప్తున్నారు. కర్ణాటకలోని గోల్డెన్ ఫిలింస్ డివిజన్ సి.ఆర్.మనోహర్ ఈ చిత్రానికి నిర్మాతగా ఉండే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment