
తమన్నా, సిద్దార్ధ కాంబినేషన్ లో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న `కొంచెం ఇష్టం-కొంచెం కష్టం'మార్కెట్లో సంచలనం సృష్ఠిస్తోంది. అందులోనూ అదిరిపోయే రీతిలో పోస్టర్స్ వేయటం, పాటలు ఇప్పటికే హిట్టవటం ఆ చిత్రంపై మరింత క్రేజ్ సృష్టిస్తున్నాయి. దాంతో ఆ చిత్ర కథేంటన్నది అన్ని వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.విశ్వసనీయ సమాచారం ప్రకారం కథలో ఎంబిఎ చదువుకున్న సిద్దు(సిద్దార్ధ)సరదాగా తిరుగుతూ అమ్మాయిలకు సైట్ కొట్టుకుంటూ..లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఇక గీత(తమన్నా) ఓ జమీందారి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన చదువుకోసం సిటీకి వచ్చినప్పుడు అక్కడ సిద్దు పరిచయవుతాడు. మొదట ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు. కానీ తర్వాత తమన్నా తన పల్లెకు వెళ్ళాక తను ప్రేమలో ఉన్నానని గమనిస్తుంది. దాంతో తన తండ్రి సుబ్రమణ్యం (నాజర్)దగ్గరకు సిద్దుని తీసుకెళ్ళి పెళ్ళి ప్రపోజల్ పడుతుంది.అయితే అప్పుడాయన సిద్దు కుటుంబం గురించి ఓ ప్రశ్న అడుగుతాడు. మీ తల్లి,తండ్రి(ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ) విడిపోయి ఉన్నారు కదా...వాళ్ళని కలపటానికి ఎప్పుడైనా ప్రయత్నించావా అని. అలాంటి కుటుంబానికి కోడలుగా నా కూతర్ని ఎలా పంపమంటావంటూ నిలదీస్తాడు. అప్పుడు సిద్దార్ధ ఏ నిర్ణయం తీసుకున్నాడు..ఎలా తన ప్రేమని దక్కించుకున్నాడనేది మిగతా కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న దర్శకుడు కిషోర్ కుమార్(డాలి)గతంలో రవితేజ..భగీరధ చిత్రానికి కథ అందించాడు. అలాగే ఈ చిత్రం కథ మొత్తం టైటిల్లోనే ఉందంటున్నాడు. మన కావల్సింది(ఇష్టం)పొందాలంటే కొంత చెల్లించాల్సి ఉంటుంది(కష్టం)...గులాబి పట్టుకోవాలంటే క్రింద ముళ్ళు గుచ్చుకున్నా భాధభరించాలి అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అంటున్నారు
No comments:
Post a Comment