telugu cine gossips

telugucinegossips: ఇదంతా అన్యాయం...కవిత
Load Counter
massage table

Friday, February 6, 2009

ఇదంతా అన్యాయం...కవిత


తాను నిజంగా వేధింపులకు పాల్పడి ఉంటే, వాళ్లు ఏనాడో చెప్పకుండా పారిపోయేవాళ్లు కదా అంటూ పనిపిల్లలపై వేధింపులకు పాల్పడ్డానంటూ వచ్చిన ఆరోపణలను సినీనటి, టిడిపి మహిళా నేత కవిత ఖండించారు. ఆ పనిపిల్లలను కన్న కూతుళ్లుగానే ప్రేమగా చూసుకున్నానని ఆమె చెప్పారు. అలాగే వారు వచ్చినమూడు నెలల్లో తమ పిల్లలకు ఫ్రెండ్స్ అయ్యారని అన్నారు. ఇక ఆ పిల్లలిద్దరినీ తనకు అప్పచెప్పిన శ్రీనివాసరెడ్డిపై మధురవాడ, అనపర్తిలో కేసులున్నాయన్న విషయం తనకు తెలిసిందని, వాటిని త్వరలో వెల్లడిస్తానన్నారు. అలాగే అని ప్రశ్నించారు. అంతగా కాకపోతే...తన అపార్టుమెంట్‌లో ఉండే వారందరినీ విచారించి నిజాలు తెలుసుకోవచ్చన్నారు. తనపై దురుద్దేశంతోనే శ్రీనివాసరెడ్డి తనపై ఫిర్యాదు చేయించారన్నారు. ఇందులో రాజకీయాలు ఉండకపోవచ్చని తాను నమ్ముతున్నానని కవిత తెలియపరిచారు.హైదరాబాద్‌ సంజీవరెడ్డినగర్‌ పోలీసు స్టేషన్‌లో బాలికలను చిత్రహింసలకు గురి చేశారనే అభియోగంపై కవితపై నిన్న (గురువారం)కేసునమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మండాపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి సహకారంతో ఇద్దరు బాలికలు కవిత ఇంట్లో 5నెలల క్రితం పనిలో చేరారు. గత కొన్ని రోజులుగా కవిత, ఆమె చిన్న కూతురు తమను వేధింపులకు గురిచేస్తున్నారని బుధవారం సాయంత్రం కవిత ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ రెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఆబాలికలను తీసుకొని ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కవితపై ఫిర్యాదు చేశారు. దీంతో కవితపై పోలీసులు ఎస్‌.సి, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........