
ప్రిన్స్ మహేష్ బాబుకి ముంబయి మాఫియా వార్నింగ్ ఇచ్చిందనే రూమర్ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎవరన్నా బ్లాగుల వాళ్ళు పుట్టించారో లేక నిజమో తెలియనంతగా జనసామాన్యంలో కలసిపోయింది. వారు చెప్పే సమాచారం ప్రకారం బాలీవుడ్ సినిమాల్లో నటించమని గత కొద్ది కాలంగా బాలీవుడ్ నిర్మాతలు మహేష్ ని సంప్రదిస్తున్నారు.అందుకు మహేష్ భార్య నమ్రత కున్న పరిచయాలు కూడా కొంతవరకూ కారణమంటున్నారు.మరో ప్రక్క బాలీవుడ్ హీరోల కట్స్ కొన్ని మహేష్ కున్నాయని అందుకే వారు మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్స్ కి వెంటపడుతున్నారని తెలుస్తోంది. అయితే మహేష్ ఇందుకు అంగీకరించటం లేదని అందుకే వారు మాఫియా ద్వారా చెప్పించారని అంటున్నారు.
దాంతో వారు మహేష్ కి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చాడని అందుకే అతను పెద్దగా బయిటకు రావటానికి ఇష్టపడంటం లేదని ప్రచారం జరుగుతోంది. నిజానికి బాలీవుడ్ లో ఇవన్నీ పూర్తిగా సహజం. అయితే ఇక్కడ మనకిలాంటి వ్యవహాలు కొత్తే. అప్పుడప్పుడూ కొందరు సీనియర్స్ తమకున్న పరపతితో హీరోయిన్స్ ని,హీరోలను బెదిరించారు కానీ ఇట్లా మాఫియాల చేత చెప్పించేంత దిగజారలేదు. అయితే మహేష్ బాబు మాత్రం ఈ విషయంలో కొంత ధైర్యంగానే ఇక్కడ కూడా వ్యవహరించాడని వినపడుతోంది. ఏదైమైనా ఇది నిజమైతై బాధాకరమే. ఇక పోకిరి వంటి సినిమాల్లో పండుగాడుగా మాఫియాను ఎదిరించిన మహేష్ నిజజీవితంలో కూడా అతను ధైర్యంగా ఉండటమే మేలు. ఎందుకంటే మహేష్ తో రాజకుమారుడు సినిమా చేసిన ప్రీతిజింతా సైతం మాఫియాకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ ఇచ్చి నిలదొక్కుకుంది.
No comments:
Post a Comment