
డార్లింగ్ అనే పదాన్ని తెలుగు పరిశ్రమలో పాపులర్ చేసిన వ్యక్తి ప్రభాస్. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకుని పూరి జగన్నాధా తన బుజ్జిగాడు చిత్రంతో ఆంద్రా ఫేమస్ చేసాడు. ఇప్పుడీ పదం మరో నిర్మాతను ఆకర్షించింది.ఆయన మరెవరో కాదు..ప్రభాస్ తో ఛత్రపతి అనే హిట్ ని అందించిన బి.వి.యస్.ఎన్ ప్రసాద్. ఆయన తాజాగా కరుణాకరణ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా డార్లింగ్ టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఛత్రపతి అనంతరం ఆయన మరో సినిమా ప్రభాస్ తో చేద్దామని వెయిట్ చేసారు...కానీ సరైన స్క్రిప్టు దొరక్క ఆగారు. ఈలోగా దశరధ్ ..దిల్ రాజు కాంబినేషన్ లో రెడీ అయ్యే చిత్రానికి ప్రభాస్ డేట్స్ కేటాయించారు.
అయితే ప్రభాస్ కి ఆ కథ నచ్చకపోవటంతో ఆ సినిమా ఆగిపోయి..ఈ ప్రాజెక్టు ముందుకొచ్చినట్లు సమాచారం. కరుణాకరన్ చెప్పిన సబ్జెక్టు ప్రభాస్ కి బాగా నచ్చటంతో వెంటనే ఓకే చెప్పాడట. మార్చినుంచి ఈ సినిమా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తమిళ భిల్లా రీమేక్ లో నటిస్తున్నాడు. ఆ చిత్రాన్ని కంత్రి ఫేమ్ మెహర్ రమేష్ రూపొందిస్తున్నాడు. తర్వాత పూరీ జగన్నాధ్, ఆదిత్యారామ్ ల సినిమా కూడా మార్చి నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అంటే కరుణాకరన్ ప్రాజెక్టు కూడా అదే సమయంలో షెడ్యూళ్ళు ప్లాన్ చేసి తీస్తారన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్ డార్లింగ్.
No comments:
Post a Comment