
అవును అనే అంటునారు కొందరు.ఎందుకు అంటే ఆమె ఏమి మాట్లాడుతుందో తనకే తెలియనంత గా పిచ్చి మాట్లాడుతుంది మరి.తన ప్రేమను తిరస్కరించిన అమ్మాయిలపై కోపంతో ప్రేమోన్మాధిగా మారిన కుర్రాళ్ళలలా చిరంజీవి పిచ్చిగా (ఉన్మాదిగా)బిహేవ్ చేస్తున్నారని తెలుగు మహిళా అధ్యక్షురాలు రోజా డైరక్ట్ గా ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కోసం ప్రయత్నించి విఫలమైన చిరంజీవి ఇప్పుడు మహాకూటమిలో కేసీఆర్ చేరటంపై ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని, మహా కూటమి, మాయకూటమి అని మతిలేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టింది. అంతేగాక మహాకూటమి ఏర్పాటుతో చిరంజీవికి షాక్ కొట్టిందని,బాలకృష్ణ రోడ్ షో లకు వస్తున్న ఆదరణ చూసి ఏకంగా ఫీజులే కొట్టేసాయని ఎద్దేవా చేసింది.
ఇక రోజా కామెంట్స్ పీఆర్పీలో ప్రతివ్యాఖ్యలకు చోటిస్తున్నాయి. చిరంజీవి గొంతు బొంగురు పోతే దానిపై నీచంగా కామెంట్ చేసిన రోజా ఇవాళ బాలయ్యకు గొంతు పెగలకపోవడంపై ఏమి సమాధానం చెప్తుందని కామెంట్ చేస్తున్నారు. అంతేగాక తన సోదరుడుకి మధ్యం లైసెన్స్ లు ఇప్పించుకున్న రోజా ఈ రోజు మధ్యానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతోందో చూడండి అంటున్నారు. అంతేగాక ఒకప్పుడు కేసీఆర్ త్రాగుబోతు అని కామెంట్ చేసినామే...ఈ రోజు ఆయన్ని వెనకేసుకు వస్తోంది..ఇది చాలదా..ఆమె దిగజారుడుతనానికి అని అంటున్నారు. ఇక ఇదంతా గమనిస్తున్న వారు ఒక వేలు ఎదుటివారిపై చూపితే మనవైపు మిగతా నాలుగు వేళ్ళూ చూపుతాయన్నది నిజం అని వ్యాఖ్యానిస్తున్నారు.
సభ్యతా సంస్కారం అనేవి ఏమాత్రం కనిపిచని వ్యక్తి కి తార్కాణం గా రోజా కనిపిస్తుంది ఈ మధ్య..లేకపోతే వ్యక్తి గత విమర్శలతోనే కాకుండా చిరంజీవి ని పిచ్చోడు అనే స్థాయికి వెళ్లిందంటే అది ఆమె దిగజారుడు తనానికి కొలమానం అని కొంతమంది డైరెక్ట్ గానే రోజా ని తప్పుపడుతున్నారు అని వినికిడి.
No comments:
Post a Comment